: తిరుమలలో 2వేల సీసీ కెమెరాల ఏర్పాటు
తిరుమలలో భ్రదతను మరింత పటిష్ఠ పరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అలిపిరి మెట్లదారి నుంచి తిరుమల కొండ వరకూ 2వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
మెట్లదారి నుంచి కొండవరకు నడిచివచ్చే భక్తులకు జరుగుతున్న ప్రమాదాలు, ఇతర కారణాల దృష్ట్యా కెమెరాలు ఏర్పాటు చేయాలని కొద్ది రోజుల కిందట టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే వీటిద్వారా వెంటనే తెలుసుకొని అధికారులు తగు సహాయక చర్యలు చేపడుతుంది.