: యువతలో కూడా గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువట


సహజంగా మధ్య వయసు వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పటి పరిస్థితుల కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నేటి యువత ఆహారపు అలవాట్లు, తింటున్న ఆహారంలో జంక్‌ఫుడ్‌ ఎక్కువగా ఉండడం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి పలు కారణాలవల్ల చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

ఇప్పుడు ఎక్కువగా 30 నుండి 40 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారికి కూడా గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని, దీనికి కారణం మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురికావడమేనని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. దీనికితోడు జంక్‌ఫుడ్‌, ధూమపానం వంటి ఇతర అలవాట్లు కూడా ఈ వయసువారిలో గుండెకు సంబంధించిన సమస్యలను ఎక్కువ చేస్తున్నాయని చెబుతున్నారు. ఒకప్పుడు మెనోపాజ్‌ దశకు చేరుకున్న తర్వాత మహిళల్లో గుండెజబ్బులు వచ్చేవని, కానీ ఇప్పుడు మెనోపాజ్‌ దశకు చేరుకోని వారిలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. ఆహారంలో తగు మోతాదులో పీచు పదార్ధం లేకపోవడం, ఇంకా సరైన పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాలవల్ల యువత గుండెకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతోందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News