: ఉన్నత ప్రమాణాల కోసం శ్రమిస్తా: నూతన డీజీపీ
ఇన్చార్జి డీజీపీ బి.ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. పోలీస్ శాఖలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు కృషి చేస్తానని చెప్పారు. పోలీస్ సిబ్బంది కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను సమీక్షించి, మరింత మెరుగైన పథకాలు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఇక శాంతిభద్రతల విషయంలో రాజీపడబోనన్నారు. ఈ సాయంత్రం ఆయన డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీజీపీగా వ్యవహరించిన దినేశ్ రెడ్డి పదవీకాలం నేటితో ముగిసిన సంగతి తెలిసిందే.