: ఇరాక్ లో మరోసారి బాంబుల మోత


ఇరాక్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. రాజధాని బాగ్దాద్ లో వరుస కారు బాంబు పేలుళ్ళు జరగడంతో 54 మంది మరణించారు. 129 మంది గాయపడ్డారు. దుండగులు 12 కార్లలో పేలుడు పదార్ధాలు అమర్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కూలీలు గుమికూడే ఓ అడ్డా వద్ద ఈ పేలుళ్ళు జరిగాయి. మరణించిన వారిలో ఇద్దరు సైనికులు కూడా ఉన్నారు. సున్నీ, షియాల మధ్య అధిపత్య పోరే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. షియా ప్రాబల్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News