: ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును వ్యతిరేకిస్తున్న జేడీయూ
2014 సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు తెరపైకి రావటంపై బీజేపీ ఇరకాటంలో పడింది. మోడీ పేరునే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీలు పట్టుబడుతున్నాయి. అయితే, ఈ నిర్ణయాన్ని ఎన్డీయేతో పోత్తుపెట్టుకున్న పార్టీలు తిరస్కరిస్తున్నాయి. జనతాదళ్ జాతీయ అధికార ప్రతినిధి శివానంద్ తివారీ మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిని సాధువులు నిర్ణయించలేరని వ్యాఖ్యానించారు. ఎన్నిక బరిలో నిలిచే ప్రధాని అభ్యర్థిని రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయని అన్నారు.
’ఎన్ డీఏ అనేక పార్టీల కూటమితో ఏర్పడిందనీ, సంకీర్ణం నుంచే ప్రధాని అభ్యర్థి వస్తారనీ, చర్చల తర్వాత ఎవరనేది నిర్ణయం తీసుకుంటామనీ తివారీ అన్నారు. మోడీ పేరును మీడియా ప్రచారం చేయవద్దని ఆయన కోరారు. కాగా, ఓ సెక్యులర్ వ్యక్తి మాత్రమే ప్రధాని కావాలంటూ, గతంలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్యాపదేశంగా మోడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించారు. దానిని సమర్ధిస్తూనే ఇప్పుడు తివారీ మట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
- Loading...
More Telugu News
- Loading...