: పార్టీ నేత మృతికి చంద్రబాబు సంతాపం


టీడీపీ మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ మృతికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గానికి చెందిన సాయినాథ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ మాజీ శాసనసభ్యుడు ఆరోగ్యం విషమించడంతో నేడు కన్నుమూశారు. పార్టీ నేత మరణవార్త తెలుసుకున్న బాబు వెంటనే ఆసుపత్రికి వెళ్ళి, సాయినాథ్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News