: ముస్లిం యువతను అక్రమంగా నిర్బంధించవద్దు: షిండే
దేశంలో ముస్లిం యువతను అక్రమంగా నిర్బంధించవద్దని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హొమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే సూచించారు. ఉగ్రవాదం సాకుతో అమాయక ముస్లిం యువకులను వేధింపులకు గురిచేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా వేధింపు చర్యలకు పాల్పడుతున్నాయని తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. తమ ప్రాథమిక హక్కులు హరించి వేస్తున్నారని మైనారిటీ వర్గాలు భావిస్తున్నాయని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని షిండే లేఖలో ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు.