: శ్రీవారి నూతన స్వర్ణరథం ఊరేగింపులో అపశృతులు


తిరుమల వెంకన్న నూతన స్వర్ణ రథం ప్రయోగాత్మక ఊరేగింపులో అపశృతులు చోటు చేసుకున్నాయి. తిరుమాడ వీధుల్లో రథాన్ని ఊరేగిస్తుండగా, రెండుసార్లు రథచక్రాలు భూమిలోకి కుంగిపోయాయి. ఆరంభంలోనే ఓసారి రథ చక్రాలు భూమిలోకి కుంగిపోగా.. క్రేన్ సాయంతో రథాన్ని పైకి లాగారు. అనంతరం పడమటి వైపు మాడవీధికి చేరుకోగా, అక్కడా అదే రీతిలో భూమిలోకి కుంగిపోయింది. మళ్ళీ క్రేన్ సాయంతో మాడవీధిలో నిలిపారు. ఎట్టకేలకు ప్రయోగాత్మక ఊరేగింపు పూర్తి చేసిన టీటీడీ అధికారులు ఆలయం ఎదుట నూతనంగా నిర్మించిన మంటపంలో రథాన్ని భద్రపరిచారు.

ఈ స్వర్ణ రథం తయారీ వ్యయం రూ.25 కోట్లు కాగా, దీని రూపకల్పనలో 74 కిలోల బంగారం, 25 టన్నుల కలప, 3 టన్నుల రాగిని వినియోగించారు. ఈ కొత్త రథంపై శ్రీవేంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 10న ఊరేగనున్నాడు.

  • Loading...

More Telugu News