: పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అప్పుడు చెప్పాం: బొత్స


తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అప్పటి పరిస్థితుల్లో పార్టీ పెద్దలకు చెప్పామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే, పరిస్థితులు మారాక కూడా దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల ముందు కొత్తపార్టీ రావడం సహజమేనన్నారు. గతంలో జగన్ తో సంబంధాలున్నవారే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని బొత్స పేర్కొన్నారు. సీఎం మారతారని చెప్పడానికి కేసీఆర్ తమ అధిష్ఠానమేమీ కాదన్నారు. 2014 వరకు ఎలాంటి మార్పులుండవన్నారు. అయితే, కేంద్రమంత్రి వర్గం ముందుకు తెలంగాణ నోట్ రాకముందే రాష్ట్రానికి ఆంటోనీ కమిటీ రావాలనుకుంటున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News