: మా ఒత్తిడి వల్లే ప్రక్రియ ఆగింది: పురందేశ్వరి
రాష్ట్ర విభజనపై కేంద్రం ముందడుగు వేయకపోవడానికి తామే కారణమంటున్నారు కేంద్ర మంత్రి పురందేశ్వరి. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడం వల్లే, తెలంగాణ ప్రక్రియ నిలిచిందని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ నోట్ ఇంకా శైశవ దశలోనే ఉందని చెప్పారు. కేబినెట్ నోట్ లో ఆంటోనీ కమిటీ సిఫారసులు కూడా పొందుపరచాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. విభజనపై ఇరు ప్రాంతాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.