: ఇన్చార్జి డీజీపీగా ప్రసాదరావు
రాష్ట్ర డీజీపీగా దినేశ్ రెడ్డి నేడు పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో బి.ప్రసాదరావును ఇన్చార్జి డీజీపీగా నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసాదరావు ఇప్పటివరకు ఏసీబీ డీజీగా వ్యవహరించారు. ఈయన 1979 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి.