: లాలూ దోషిగా నిరూపితమవడంపై బీజేపీ స్పందన
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను దాణా స్కాంలో సీబీఐ కోర్టు దోషిగా తేల్చడం పట్ల బీజేపీ స్పందించింది. ఆయనకు శిక్ష పడనుండడం హర్షణీయ పరిణామమని పేర్కొంది. బీజేపీ ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ ఢిల్లీలో మాట్లాడుతూ, రాంచీలోని సీబీఐ న్యాయస్థానం వెలువరించిన తీర్పు చారిత్రకమని అభివర్ణించారు. ఈ తీర్పుతో పది కోట్ల మంది బీహారీలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. యూపీఏతో పొత్తు పెట్టుకుని ఇన్నాళ్ళూ నెట్టుకొచ్చారని లాలూపై రూఢీ ధ్వజమెత్తారు. బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ స్కాం నిందితులకూ శిక్షలు పడాలని రూఢీ ఆకాంక్షించారు.