: గాలి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
ఓఎంసీ కేసులో గాలి జనార్ధనరెడ్డి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఆరువారాల పాటు వాయిదా వేసింది. గాలి పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరడంతో న్యాయస్థానం విచారణను ఇన్ని రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది.