: సీబీఐ జేడీ కాల్ లిస్టు కేసులో నిందితులకు సుప్రీం నోటీసులు
సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ కాల్ లిస్టును అక్రమంగా సేకరించిన కేసులో నిందితులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రఘురామకృష్ణంరాజు, ఎంవీ రమణారావు నిందితులని సీబీఐ పేర్కొంది. గతంలో వీరిద్దరికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. ఈ అంశంపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం నిందితులకు నోటీసులిచ్చింది.