: వైఎస్సార్సీపీలో చేరతానంటున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే


కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి త్వరలోనే వైఎస్సార్సీపీలో చేరతానంటున్నారు. నేడు హైదరాబాదులో జగన్ ను కలిసిన అనంతరం ఈ కాంగ్రెస్ శాసనసభ్యుడు మీడియాతో మాట్లాడారు. మరికొద్ది రోజుల్లో తన నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఆ సందర్భంగా జగన్ సమక్షంలోనే వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News