: రాంచీలోని బిస్రాముండా జైలుకు లాలూ తరలింపు
దాణా కుంభకోణం కేసులో దోషిగా నిరూపితమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను రాంచీలోని బిస్రాముండా సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు సీబీఐ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అక్టోబరు 3న ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నారు. అయితే, కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత హైకోర్టును ఆశ్రయిస్తామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ ఝా తెలిపారు.