: యువీకి బెర్తు.. ఆసీస్ టూర్ కు భారత జట్టు ఎంపిక నేడే
డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ పునరాగమనానికి రంగం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా జట్టుతో ఒక టీ20 మ్యాచ్ తో పాటు, ఏడు వన్డేల సిరీస్ లో తొలి మూడు వన్డేలకు గాను భారత జట్టును ఎంపిక చేసేందుకు ఈ రోజు భారత సెలక్షన్ కమిటీ చెన్నైలో సమావేశం కానుంది. జట్టులోకి యువరాజ్ సింగ్ ఎంపిక లాంఛనంగా మారింది. వరల్డ్ కప్ అనంతరం క్యాన్సర్ బారిన పడి కోలుకున్న యువీ జనవరి 27న చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తదనంతరం ఫామ్ లేమితో జట్టులో చోటు కోల్పోయిన యువీ.. ఫిట్ నెస్, ఫాం పై శ్రద్ధ పెట్టి విండీస్-ఏ జట్టుపై అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో అన్నీ తానై వెస్టిండీస్-ఏ జట్టుకు చుక్కలు చూపించాడు.