: లాలూను దోషిగా తేల్చిన కోర్టు


దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (66) ను సీబీఐ కోర్టు దోషిగా పేర్కొంది. 16 ఏళ్ళ కిందట దేశంలో సంచలనం కలిగించిన ఈ కేసులో ప్రధాన నిందితుడు లాలూ పాత్ర ఉన్నట్టు రాంచీలోని సీబీఐ కోర్టు నిర్ధారించింది. లాలూ సహా 45 మందిని కోర్టు దోషులుగా పేర్కొంది. వీరికి అక్టోబరు 3న శిక్షలు ఖరారు చేస్తారు. లాలూకు మూడు నుంచి ఏడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా, 1997లో ఈ వ్యవహారంలో ఆరోపణలు వెల్లువెత్తడంతో లాలూ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సి వచ్చింది. పశువుల దాణాకు సంబంధించి లాలూ రూ.35.66 కోట్లు దిగమింగారన్న అభియోగంపై సీబీఐ విచారణ చేపట్టింది.

  • Loading...

More Telugu News