: బహుళంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇంజినీర్లపై వేటు
ముంబయిలోని డాక్ యార్డు రైల్వే స్టేషన్ పరిధిలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో ఏడుగురు ఇంజినీర్లపై వేటు పడింది. ఇంజినీర్లను విధుల నుంచి తొలగించినట్లు 'బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్' (బీఎంసీ) తెలిపింది. మరో 18 మంది ఇంజినీర్లపై విచారణ చేపట్టినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటనపై అధికారులు సర్వే నిర్వహించగా.. నగరంలో 95 భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 60పైన చనిపోయారు.