: ఉగ్రవాదుల దాడిలో 50 మంది విద్యార్ధులు మృతి
నైజీరియాలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. గజ్ బా వద్ద వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్ధులపై దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 50 మంది విద్యార్ధులు మరణించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. గతరాత్రి విద్యార్ధులు వారి హాస్టల్లో నిద్రపోతున్న సమయంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు. 18 మంది విద్యార్ధులు గాయపడినట్లు చెప్పారు. బోకో హరామ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.