: వీడ్కోలు వందనం స్వీకరించిన దినేశ్ రెడ్డి
రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అంబర్ పేట పోలిస్ మైదానంలో వీడ్కోలు వందనం స్వీకరించారు. నేటితో ఆయన పదవీకాలం ముగియనుండటంతో పోలిస్ శాఖ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వీడ్కోలు కార్యక్రమానికి రాష్ట్రంలోని పోలిస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.