: ఔరా...'కౌటిల్యా'...!!


అలనాటి అర్ధశాస్త్ర ఘనుడు కౌటిల్యుడు. ఈ పేరు తెలియనివారుండరు. అయినా ఈ పేరు పెద్దగా ఎవరూ తమ పిల్లలకు పెట్టుకోరు. ఇలాంటి పేరుతో ఉన్న ఒక చిన్నారి అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. వయసు ఐదేళ్లు కావడంతో అందరూ ఈ చిన్నారిని బాలమేధావి అంటున్నారు. ఇంతకీ ఈ మేధావి మేధస్సు ఏంటనేగా... ఈ కౌటిల్యుడు రాజకీయాలు, అర్ధశాస్త్రం, ప్రపంచానికి సంబంధించిన సమాచారం, భూగోళానికి సంబంధించిన సమాచారం ఇలా ఒకటికాదు పలు అంశాలకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని అడిగినా ఇట్టే సమాధానం చెప్పేస్తున్నాడట. దీంతో అందరూ ఆహా... అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట.

సోనెపట్‌లో ఐదేళ్ల కౌటిల్య అనే బాలుడు అద్భుతమైన జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. సహజంగానే ఇలాంటి వారితో టీవీ మీడియాలవాళ్లు వాళ్ల టీవీల్లో ఇంటర్వ్యూలు ఇప్పించేస్తూ ఉంటారు. దీంతో కౌటిల్య తీరికలేకుండా బిజీ అయిపోయాడు. టీవీ షోల్లో జనాలు అడుగుతున్న వివిధ దేశాల జనాభా, జీడీపీ, సంస్కృతి, వారసత్వం వంటి పలు అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెబుతున్నాడు.

ఇంత చిన్న వయసులోనే అంత జ్ఞానం ఎలా సాధ్యం? అంటే తనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమని, తన దేశం, ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని చెబుతున్నారు. ఇప్పుడు ఒకటవ తరగతి చదువుతున్న కౌటిల్య ప్రతిభ తెలుసుకున్న హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడా తనను కలుసుకోవాల్సిందిగా అక్టోబరు 4న అప్పాయింట్‌మెంట్‌ను ఇచ్చాడని తండ్రి సతీశ్‌ శర్మ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News