: పార్లమెంటులో బిల్లు పెడితే హైదరాబాదులో మిలియన్ మార్చ్: అశోక్ బాబు
పార్లమెంటులో బిల్లు పెడితే సమైక్యవాదులతో హైదరాబాద్ నగరంలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ బొగ్గు, గోదావరి నీళ్ళను సీమాంధ్రులు వాడుకోవటం లేదని ఆయన స్పష్టం చేశారు. భౌగోళికంగా ఆంధ్ర, తెలంగాణకు నదులే హద్దులని, వాటిని నిలువుగా ఎలా చీలుస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగితే పోతిరెడ్డిపాడుపై యుద్ధాలు తప్పవని ఆయన హెచ్చరించారు. మద్రాస్ నుంచి అంధ్ర రాష్ట్రం వేరువడిన అనంతరం హైదరాబాద్ లో ఆంధ్ర రాష్ట్రం కలవలేదని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు.