: ఎంపీల మెడలు వంచి తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటాం: అశోక్ బాబు


తమ ప్రాంత ఎంపీల మెడలు వంచి పార్లమెంట్ లో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. సమైక్యవాదం సీమాంధ్ర ప్రజల గుండెల్లో ఉందని, తమ అంగీకారం లేనిదే తెలంగాణ ఏర్పడబోదన్న విషయాన్ని తెలంగాణవాదులు గుర్తించాలని ఆయన అన్నారు.

సీమాంధ్రులు తెలంగాణను దోపిడీ చేశారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమని తెలిపారు. 20 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలోని నిర్మాణాలన్నీ కృష్ణా జిల్లా కంచికచర్ల ప్రాంతంలోని ఇసుకతోనే పూర్తిచేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి పూచిక పుల్ల కూడా సీమాంధ్రకు రాలేదని, సీమాంధ్ర నుంచి అన్ని వనరులు హైదరాబాద్ కు వెళ్లాయని తెలిపారు.

హైదరాబాద్ కు విద్యుత్ విజయవాడ ధర్మల్ కర్మాగారం నుండే వస్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ కు వీటీపీఎస్ నుంచి సరఫరా చేసే విద్యుత్తును ఒక గంట పాటు ఆపితే, సీమాంధ్రలో గ్రామాలకు 12 గంటలపాటు విద్యుత్ ఇవ్వవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News