: ఆంటోనీ కమిటీని పంపమని సోనియాకు లేఖ రాసిన బొత్స
ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపమని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. విభజన వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపాలని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేశారు. ఆంటోనీ అనారోగ్యంతో ఉన్నందువల్ల, కమిటీలోని మిగిలిన ముగ్గురు సభ్యులను రాష్ట్రానికి పంపాలని ఆయన కోరారు. తెలంగాణ నోట్ కేంద్రమంత్రిమండలి ముందుకు రాకముందే రాష్ట్రానికి కమిటీ సభ్యులను పంపాలని ఆయన కోరారు.