: 2014 ఎన్నికల్లో మోడీదే విజయం: బాబా రామ్ దేవ్
2014లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని యోగా గురు బాబా రామ్ దేవ్ జోస్యం చెప్పారు. చికాగోలో స్వామి వివేకానంద దినోత్సవం పేరిట జరిగిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆయన భారత రాజకీయాల గురించి మాట్లాడారు. నరేంద్రమోడీ రాబోయే ఎన్నికల్లో వంద శాతం విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశం మార్పు కోరుకుంటోందని, 2014 లో భారత రాజకీయాల్లో కొత్త చరిత్ర మొదలవుతుందని రామ్ దేవ్ వ్యాఖ్యానించారు. ఇటీవల లండన్ విమానాశ్రయంలో తనను నిర్భంధించిన సంఘటనలో ప్రభుత్వం కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.