: చివరి అంకానికి చేరుకున్న తెలంగాణ ఉద్యమం : గుండా మల్లేష్


తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ తుది దశకు చేరుకుందని సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ తెలిపారు. తెలంగాణ సకల జన భేరిలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ పోరాటాన్ని కాలిన కడుపు పోరాటంగా మల్లేష్ వర్ణించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం కారణంగా ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు జరగబోతోందని అన్నారు. సమైక్యాంధ్ర పోరాటం అనైతికమని అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటుకు ఎవరూ అడ్డుపడరాదని కోరారు. ఆంధ్ర ప్రాంతం వారికి ఎలాంటి అన్యాయం జరిగినా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News