: హైదరాబాద్ తెలంగాణ గుండె కాయ : గోవర్ధన్
హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అని తెలంగాణ ఐకాస నేత గోవర్ధన్ అన్నారు. సకల జన భేరీ సభలో ఆయన మాట్లాడుతూ కేవలం హైదరాబాద్ పై మాత్రమే కొందరు సీమాంధ్ర నాయకులు తమ వాదనను లేవనెత్తడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు.