: డీజీపీ దినేష్ రెడ్డి పిటీషన్ ను కొట్టేసిన హైకోర్టు
డీజీపీ దినేష్ రెడ్డి హౌస్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో డీజీపీ గా దినేష్ రెడ్డి పదవీకాలం రేపటితో ముగియనుంది. వివరాల్లోకి వెళితే... డీజీపీగా తన పదవీకాలం ముగుస్తుండటంతో మరికొంత కాలం కొనసాగించాలని ఆయన క్యాట్ ను సంప్రదించారు. క్యాట్ ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టులో తన పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని... హౌస్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేశారు. అయితే, దినేష్ రెడ్డి ఇప్పటికే రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉన్నారని... కాబట్టి ఆయన్ను పొడిగించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. దీంతో ఆయన పిటీషన్ ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది.