: వాస్తవాధీన రేఖ వద్ద సంయుక్త యంత్రాంగం అవసరం : నవాజ్ షరీఫ్


భారత్, పాక్ మధ్య గల వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలను తొలగించుకునేందుకు 'ఇరుదేశాల సంయుక్త యంత్రాంగం' ఏర్పాటును ప్రతిపాదిస్తున్నట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. ఇరు దేశాల ప్రధానుల భేటీకి ముందు ఆయన ఒక భారతీయ వార్తా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా 1999లో భారత్ తో తెగిపోయిన బంధాన్ని తిరిగి కొనసాగించేందుకే ఆయనతో భేటీ అవుతున్నట్టు తెలిపారు. భారత ప్రధాని మన్మోహన్ చాలా మంచి వ్యక్తని కితాబిచ్చారు. జమ్మూలో ఇటీవల ఉగ్రవాదులు చేసిన దాడిని ఆయన ఖండించారు.

  • Loading...

More Telugu News