: కిరణ్ సీల్డ్ కవర్ సీఎం అయితే, మీకు ఆ కవర్ కూడా లేదు కదా? : జేసీ
ముఖ్యమంత్రి కిరణ్ పై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తప్పుపట్టారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం కిరణ్ ను సీల్డ్ కవర్ ముఖ్యమంత్రిగా అభివర్ణించడం బాధాకరమని అన్నారు. కిరణ్ సీల్డ్ కవర్ సీఎం అయితే, మీకు ఆ కవర్ కూడా లేదు కదా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఉన్నవారంతా సోనియాగాంధీ ఆశీస్సులతో పనిచేస్తున్నవారమే అని జేసీ తెలిపారు.