: సీల్డ్ కవర్ ద్వారా ఎంపిక చేయడం సాంప్రదాయమే: పితాని
కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచీ సీఎం, మంత్రులను సీల్డ్ కవర్ ద్వారా ఎంపికచేయడమే సాంప్రదాయమని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల విమర్శల్లో వాస్తవం లేదని పితాని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకు కేంద్రం విలువిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.