: నేడో,రేపో గ్రూప్-2 ఫలితాలు


గ్రూప్-2 ఫలితాలు ఈ వారం చివరిలోగా ప్రకటించేందుకు ఏపీపీఎస్సీ సమాయత్తమవుతోంది. ఏపీపీఎస్సీ.. ఫిబ్రవరి మొదటి వారంలో పరీక్షకు సంబంధించిన కీని విడుదల చేసింది. కీలో తప్పులున్నాయంటూ కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తడంతో సర్వీస్ కమిషన్ వాటిని పరిశీలించింది. అయితే, అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఏపీపీఎస్సీ ఫలితాల విడుదలకు తుది కసరత్తులు చేస్తోంది. దీంతో, నేడోరేపో గ్రూప్-2 ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

  • Loading...

More Telugu News