: రఘువీర ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలి : ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి


మంత్రి రఘువీరారెడ్డి అక్రమ ఆస్తులపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి డిమాండ్ చేశారు. 2004 కు ముందు కోల్డ్ స్టోరేజికి కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రఘువీరా... ఇప్పుడు వేల కోట్లు అక్రమంగా సంపాదించారని తెలిపారు. బెంగళూరులో రూ. 350 కోట్లతో స్టార్ హోటల్ నిర్మించారని అన్నారు. దీనికి తోడు హైదరాబాద్ లోని మహేంద్రగిరి హిల్స్ లో 23 ఎకరాలను ఆక్రమించుకున్నారని వెల్లడించారు. మైసూర్ లో రఘువీరా 60 ఎకరాల్లో ఫాంహౌస్ నిర్మించారని, ఒడిశాలో 1200 ఎకరాల భూమిని కొని అందులో పామాయిల్ తోటలు వేశారని తెలిపారు. అంతేకాకుండా, ఆయన పుట్టపర్తి సాయిబాబా ఆస్తులను సైతం వదల్లేదని... ట్రస్టుతో కుమ్మక్కైన తర్వాతే బాబా మరణించిన సంగతిని బయటకు చెప్పారని విమర్శించారు. పెనుగొండలోని కాళేశ్వర స్వామి ఆస్తులను కూడా ఆక్రమించుకున్నారని అన్నారు. రఘువీరా అక్రమాస్తులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తున్నట్టు గుర్నాధరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News