: కర్నూలులో కొనసాగుతున్న సమైక్య గర్జన
సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలులో సమైక్య గర్జన కొనసాగుతోంది. జిల్లా నలుమూలల నుంచి ఈ సభకు భారీ సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, గ్రామస్తులు హాజరయ్యారు. పాఠశాల విద్యార్థినులు మా 'తెలుగు తల్లికి' పాట పాడుతూ నాట్యం చేశారు. సభా ప్రాంగణం సమైక్య నినాదాలతో మారుమ్రోగుతోంది.