: వైకాపా రాష్ట్రాన్ని చీల్చేందుకు సిద్ధమైంది : రాజేంద్రప్రసాద్
వైకాపా సమైక్యాంధ్ర కోసం కాకుండా... రాష్ట్రాన్ని చీల్చేందుకు సిద్ధమైందని తెదేపా నేత, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. సోనియాగాంధీకి తెలుగు ప్రజలను తాకట్టు పెట్టేందుకు జగన్ మారీచుడి వేషంలో వచ్చారని దుయ్యబట్టారు. జగన్ పై ఇప్పటిదాకా తాము చెప్పినవన్నీ నిజమయ్యాయని... కాబట్టి సీమాంధ్ర ప్రజలు, ఐకాసలు జగన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంత కాలం జైల్లో గడిపిన జగన్... ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలవడానికి సమైక్య రాగాన్ని అందుకున్నారని అన్నారు. కసాయివాడిని గొర్రె నమ్మినట్టు... ప్రజలు జగన్ ను నమ్మరాదని రాజేంద్రప్రసాద్ హితవుపలికారు.