: జగన్ ను కలిసిన న్యాయవాదులతో మాకు సంబంధం లేదు: ఐకాస కన్వీనర్ మోహన్ రెడ్డి
నిన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కలిసిన న్యాయవాదులతో తమకు సంబంధం లేదని సమైక్యాంధ్ర న్యాయవాదుల ఐకాస కన్వీనర్ సీవీ మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర న్యాయవాదుల ఐకాస ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించదని అన్నారు. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో కలసి మాత్రమే తాము ఉద్యమిస్తామని ప్రకటించారు.