: ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.12 కోట్ల విరాళాలు
అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు విరాళాల ద్వారా రూ.12 కోట్లు సేకరించినట్టు ప్రకటించింది. తమ పార్టీకి రిక్షా కార్మికుల నుంచి వ్యాపారస్తుల వరకు, ఉద్యోగుల నుంచి ప్రవాస భారతీయుల వరకు అన్ని వర్గాల వారు విరాళాలు అందజేశారని పార్టీ పేర్కొంది. రోజుకు పది లక్షల చొప్పున విరాళాలు అందుతున్నాయని, రూ.20 కోట్లు సేకరించాలనే తమ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని పార్టీ వర్గాలు తెలిపాయి.