: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు దక్కిన అరుదైన గౌరవం
అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. చర్చల తర్వాత ఒబామా శ్వేతసౌధంలోని తన కార్యాలయం వరండా దిగొచ్చి భారత ప్రధానికి వీడ్కోలు పలికారు. అత్యంత కఠినమైన శ్వేతసౌధం నిబంధలనన్నింటిని పక్కన పెట్టి ఒబామా ఈ విధంగా వీడ్కోలు పలకడం అత్యంత అరుదైన ఘటనగా ప్రొటోకాల్ విషయాలు తెలిసిన అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఒబామా ఎవరికీ ఇంతటి గౌరవం ఇవ్వలేదని వారు తెలిపారు. మన్మోహన్ సింగ్ ని ఓ గొప్పనేతగానే కాకుండా ... ఆర్ధిక వేత్తగా, దౌత్యవేత్తగా ఒబామా గౌరవిస్తారని ప్రొటోకాల్ అధికారులు చెప్పారు.
"మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రిగా అమెరికాకు, వ్యక్తిగతంగా నాకు అత్యంత గొప్ప స్నేహితుడు" అని సమావేశం అనంతరం ఒబామా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. "విభిన్న రంగాలలో రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు, విస్తరించేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా అద్భుతమైన తోడ్పాటు నందిస్తున్నారని" మన్మోహన్, ఒబామాపై ప్రశంసల వర్షం కురిపించారు.