: చెత్త కుప్పలో ఆడ శిశువు
నిజామాబాద్ పట్టణంలోని ప్రగతి నగర్ కాలనీలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుప్పలో గుర్తించారు. రోజు వారీ చెత్తను తీసేందుకు వచ్చిన మున్సిపల్ సిబ్బంది, చెత్త తీస్తుండగా ఈ ఆడ శిశువు కనిపించింది. దీంతో వారు పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చిన స్థానికులు పసికందును చూసి చలించిపోయారు.