: సోదరసోదరీమణులారా నమస్కారములు..: తెలుగులో మొదలెట్టిన సుష్మా
పాలమూరు తెలంగాణ గర్జన సభలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. 'సోదరసోదరీ మణులారా అందరికీ నమస్కారములు' అంటూ తెలుగులో పలకరించి ఆకట్టుకున్నారు. అనంతరం ఆమె ప్రసంగం కొనసాగించారు. 'తెలంగాణ మొత్తం ఏకతాటిపై నిలబడడాన్ని అభినందిస్తున్నాను. గతంలో కొన్నిసార్లు తెలంగాణ ఏర్పాటు జరగాల్సింది. పిల్లలు చచ్చిపోతున్నారు. తల్లులు ఏడుస్తున్నారు. దీనికి నేను ఆవేదన చెందుతున్నాను' అని తెలిపారు. ఇప్పుడు తనలో విజయం దక్కుతుందన్న విశ్వాసం ఉందని అన్నారు. ఒకసారి 2009లో నమ్మకద్రోహాన్ని చవిచూశారని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణకు అడ్డుపడ్డాడని అన్నారు. విభజన ప్రకటనను సోనియా పుట్టిన రోజు బహుమతి అన్నారని గుర్తు చేశారు. అయితే, నిర్ణయాన్ని ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆమె అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆవేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.