: హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నిజాం కళాశాలలో రేపు తెలంగాణ జేఏసీ నిర్వహించనున్న 'సకలజనుల భేరి' సదస్సు నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈ క్రమంలో కళాశాల పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించామన్నారు. అంతేగాక భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కమిషనర్ చెప్పారు.