: డబ్బింగు సీరియళ్లకు స్వస్తి చెబుతున్న ఈటీవీ


డబ్బింగు సీరియళ్ళను ప్రోత్సహించకూడదని ఈటీవీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితికి ఈటీవీ యాజమాన్యం లిఖిత పూర్వకంగా తెలియజేసింది. గత కొన్ని రోజులుగా టీవీ పరిశ్రమ పరిరక్షణ సమితి డబ్బింగు సీరియళ్ళకు స్వస్తి చెప్పాలంటూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ముందుగా తమకు ఈటీవీ సహకరించిందని సమితి అధ్యక్షుడు సురేష్ కుమార్ తెలిపారు.

డబ్బింగు సీరియళ్ళ నిషేధంపై మిగతా చానెళ్ళు కూడా ఈటీవీని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. వచ్చే ఉగాది నుంచి తెలుగు చానెళ్ళలో కేవలం తెలుగు సీరియళ్లు మాత్రమే వుండాలని తాము నిర్ణయించామని సురేష్ కుమార్ చెప్పారు. తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో ఈటీవీ అందరి కంటే ముందు ఉంటోందని ఆయన ప్రశంసించారు. కాగా, ఈ విషయంలో ఒక్క 'మాటీవీ' తప్ప మిగతా టీవీ చానెళ్ళు కూడా డబ్బింగు సీరియళ్ళ నిషేధానికి సుముఖంగానే వున్నట్టు తెలుస్తోంది.       

  • Loading...

More Telugu News