: కాంగ్రెస్ కు మరో తలనొప్పి తెచ్చిపెట్టిన తరుణ్ గొగోయ్


క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్లిచ్చామని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వెల్లడించారు. దోషులుగా తేలిన చట్టసభ సభ్యుల్ని రక్షించేందుకు ఆర్డినెన్స్ తేవడం అనాలోచితమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తాను సమర్థిస్తున్నానని ఈ కాంగ్రెస్ సీఎం తెలిపారు. నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మార్గదర్శకాలు సిద్ధం చేయలేదని ఆయన తెలిపారు. రాహుల్ ప్రతిపాదనను తాను స్వాగతిస్తున్నానని, ఆ ఆర్డినెన్స్ ను తాను కూడా వ్యతిరేకిస్తున్నానని గొగోయ్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాహుల్ వ్యాఖ్యలతో విమర్శలను ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్ కు, గొగోయ్ వ్యాఖ్యలు మరింత తలనొప్పిగా మారనున్నాయి.

  • Loading...

More Telugu News