: ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటోంది వాళ్ళే: లగడపాటి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఆ ప్రయత్నాలన్నీ తమకు తెలుసునన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టించాలనేది సమైక్యవాదుల ముసుగులో వస్తున్న వేర్పాటువాదుల లక్ష్యమని, వారే ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని తెలిపారు. అలా విభజన ప్రక్రియను సులువు చేయాలనుకుంటున్న వారి ఆటలు సాగనీయబోమని హెచ్చరించారు. కిరణ్ నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని లగడపాటి చెప్పారు. సమైక్య రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తులు సీఎం కిరణ్ సమైక్యాంధ్ర అనడాన్ని తప్పుపడుతున్నారని మండిపడ్డారు.

సీమాంధ్రలో సమ్మె అరవై రోజులు దాటాకే ప్రజల కడుపుమంట అన్ని పార్టీలకు అర్ధమైందని ఢిల్లీలో మీడియా సమావేశంలో లగడపాటి ఎద్దేవా చేశారు. మ్యానిఫెస్టోకు విరుద్ధంగా విభజనపై అడుగు ముందుకేస్తే రాజీనామాలు చేస్తామని గతంలోనే చెప్పామని.. చెప్పినట్లే రాజీనామా చేశామన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ల వ్యవహారాన్ని తన రాజీనామా ఆమోదించాక బయటపెడతానన్నారు. ఉత్తరాంధ్రలో ఉద్యమం అంతగా లేదని అధిష్ఠానం అంటే చిరంజీవి ఖండించారని చెప్పారు.

  • Loading...

More Telugu News