: తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదు: దిగ్విజయ్ సింగ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు వస్తాయని, అందువల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్ చెప్పిన మరుసటి రోజే దిగ్విజయ్ సింగ్ వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజనపై అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకున్నామని, మరోసారి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.