: జమ్మూ, కథువాలలో హై అలర్ట్


రెండ్రోజుల క్రితం టెర్రరెస్టు దాడులతో నెత్తురోడిన జమ్మూ కాశ్మీర్ ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. ఈ రోజు కొంత మంది తీవ్రవాదులను తాము చూసినట్టు కథువా జిల్లాలోని కొందరు గ్రామస్తులు చెప్పడంతో... సైన్యం, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే జమ్మూతో పాటు కథువాలో హై అలర్ట్ ప్రకటించారు.

దీనికి తోడు సరిహద్దుల్లోని కుప్వారా ప్రాంతంలో దాదాపు 30 మంది తీవ్రవాదులు మన దేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నట్టు లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ తెలిపారు. మూడు రోజులుగా వీరిని నిలువరించడానికి భద్రతాదళాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. చొరబాటుకు ప్రయత్నిస్తున్న వారిలో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, అల్ బదర్, జైష్ ఏ మొహమ్మద్ కు చెందిన తీవ్రవాదులున్నారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.

టెర్రరిస్టులుగా భావిస్తున్న కొంత మంది మన భూభాగంలోనికి చొచ్చుకొస్తున్న దృశ్యాలను ఒక మానవ రహిత విమానం చిత్రీకరించింది. దీనికితోడు గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో... ఖచ్చితంగా కొంత మంది ఉగ్రవాదులు కథువా ప్రాంతంలో సంచరిస్తున్నారని సైన్యం బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే జమ్మూ, కథువా ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News