: మరోసారి కంపించిన పాక్.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
కొద్దిరోజుల క్రితం పాకిస్తాన్ లో సంభవించిన భూకంపం పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలిగొన్న తెలిసిందే. తాజాగా మరోసారి పాక్ లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాక్ ఈశాన్య ప్రాంతం అవరన్ జిల్లాలో ఈ మధ్యాహ్నం భూకంపం సంభవించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8 గా నమోదైంది. భూ ఉపరితలానికి 14 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా, ఈ భూకంపం సంభవించిన సమయంలో భారత రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి.