: ముజఫర్ నగర్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు


ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అల్లర్ల సమయంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అల్లర్లలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇస్తారని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఆ కుటుంబాల్లో 18 సంవత్సరాలు పైబడిన వారికి, విద్యార్హత ఆధారంగా అవకాశం కల్పిస్తామని వివరించారు. సెప్టెంబర్ 15న చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అమలు చేస్తారన్నారు. ఈనెల మొదటివారంలో జరిగిన అల్లర్లలో 62 మంది మరణించినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News