: సమైక్య తీర్మానానికి బాసటగా నిలిస్తే ఎన్నికల్లో గెలిపిస్తాం: అశోక్ బాబు


అసెంబ్లీలో సమైక్య తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించిన వారికి ఎన్నికల్లో మద్దతిస్తామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉద్యమం కొనసాగించాలని పలు పార్టీలు కోరడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, విడిపోతే కలిగే నష్టాలు, కలిసుండడంవల్ల ఒనగూరే లాభాలను తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో వివరిస్తామని తెలిపారు. సమ్మె కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నందున, విరమించే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు.

కాగా, ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థలు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. ఇక ఉద్యమ కార్యాచరణలో భాగంగా రేపు కర్నూలులో సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్టోబరు మొదటివారంలో గాజువాకలో భారీ ర్యాలీ చేపడతామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News